గుడివాడ
గత వారం రోజులుగా విపరీతమైన ఎండలు తో అల్లాడిపోతున్న గుడివాడ ప్రజానీకం కు ఒక ఉపశమనము గా గురువారం ఉదయం నుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గంట నుండి విపరీతమైన నల్లటి మబ్బులతో వాతావరణం చల్లదనం గా మారడంతో గుడివాడ ప్రజలు సేద తీరుతున్నారు. చిరుజల్లులు తో కూడిన వర్షం ఉదయం నుండి పడుతున్నది.
మడకశిరలో దంచికొట్టిన భారీ వర్షం పొంగి పొర్లుతున్న పలు చెరువులు :
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో భారీ వర్షపాతం నమోదైంది.గత రాత్రి కురిసిన వర్షానికి మడకశిర నుంచి పెనుగొండకు వెళ్లే ప్రధాన రహదారి లో వంకలు పారడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అలాగే మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో వడిసి లమ్మ గుడి దగ్గర తారు రోడ్డు కోతకు గురై నాలుగైదు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మడకశిర మండల పరిధిలోని ఎర్ర బొమ్మనహళ్లి, చత్రం, గౌడనహళ్ళి, ఉప్పీడిపల్లి, మణురు చేరువులు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిస్థాయిలో నిండి మరువ పారడం తో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మడకశిర పట్టణంలో లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమై పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
మడకశిర మండలంలో 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే అమరాపురం మండలం లో 50 మిల్లీ మీటర్లు ,అగలి మండలం లో 46 మిల్లీమీటర్లు, రోళ్ల మండలం లో 61 మిల్లీ మీటర్లు, గుడిబండ మండలం లో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.ఏది ఏమైనా తొలకరి లోనే అధిక వర్షాలు పడడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం చేశారు.