YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రిజర్వ్ ఫారెస్ట్ లో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు…నిందితులు పరారీ

రిజర్వ్ ఫారెస్ట్ లో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు…నిందితులు పరారీ

కొండపల్లి
కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గట్టు పై 7కిలో మీటర్ల లోపల బెన్నీ ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో త్రవ్వకాలు జరిగాయి. 1880వ సంవత్సరంలో బ్రిటీష్ వారి హయాంలో  ఐరన్ కోర్ మిల్స్ నిర్మించారు. నిధుల కోసం పురాతన కట్టడాలను ద్వంసం చేసి సుమారు 50అడుగుల లోతు త్రవ్వకాలను అక్రమార్కులు చేపట్టారు. పురాతనమైన బావిని కూడా త్రవ్వినట్లుగా గుర్తించారు. త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో బంగారం,వజ్రాలతో కూడిన భారీ నిధి ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే  కేటుగాళ్లు పరారయ్యారు. అడవి లో కర్రలను నరికి తయారు చేసిన నిచ్చెన ని గుర్తించి ధ్వంసం చేసారు. 10మంది ముఠా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. త్రవ్వకాలకు పాల్పడిన వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అధికారుల తీరుపై విమర్శలు,పురాతన సంపదను,అడవిని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పటిష్ట భద్రతని కూడా కల్పించకపోతే నిధుల కోసం త్వవ్వకాలతో కొండపల్లి అడవి తన రూపాన్ని కోల్పోనుందనడంలో అతిశయోక్తి లేదు.

Related Posts