విజయవాడ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ముసాఫిర్ ఖానా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ స్థానిక ముస్లింలకు అందుబాటులోకి రాలేదని ఎమ్ సీ పీ ఐ ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.. పశ్చిమ నియోజవర్గం ఏ పేద మధ్యతరగతి ముస్లింలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పుతు స్ధానిక ఎమ్ ఎల్ ఏ మాజీ మంత్రి వెల్లపల్లి గత నెలలో అట్టహాసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారని, నెలలు గడుస్తున్నా ఈ ముసఫిర్ఖాన స్థానికులకు అందుబాటులో లేకపోవడం దారుణమని ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి ఎస్ కే ఖాధర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముసాఫిర్ ఖానా ని స్ధానిక పేద ముస్లింలకు అందుబాటు లోకి తీసుకు రాక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో తామే స్వయంగా ఆక్రమించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని హెచ్చరించారు..