YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాహ జీవితం పై అవగాహన సదస్సు

వివాహ జీవితం పై అవగాహన సదస్సు

కడప
పెళ్లయిన కొద్ది రోజులలోనే భార్య, భర్తల మధ్య, సఖ్యత లేక, విడిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఒకరిపై ఒకరికి అవగాహన లేకపోవడం.  ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం వివాహ కుటుంబ  బంధాలు, బాధ్యతలు తెలుసుకోక పోవడమే ప్రధాన కారణమని, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ అబ్రహం అన్నారు.
ఆరోగ్యమాత చర్చి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  మరణం వారిని వేరు చేసేంతవరకు కలిసి ఉండాల్సిన భార్య భర్తలు, కాళ్లకు పారాణి కూడా ఆరకముందే!  వారి వివాహ జీవితం ఆరిపోతున్నాయని ఆయన చింతించారు.  దేవుడు కోరుకున్నది ఇది కాదని, నీవు నీ  భార్యను హత్తుకుని  జీవిస్తూ పిల్లలను కానీ, ఈ భూమిని నిండిoచమని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వివాహము ఎంతో ఘనమైనదని, సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన దంపతులు ఆదిలోనే ఆవిరి కావడం  అవగాహన లోపమే నని, యువతీ యువకులకు వివాహ జీవితం పై పూర్తి అవగాహన కల్పిస్తూ, భార్య భర్తల జీవితం ఎంతో విలువైనదని తెలియచెప్పడంతో వారి జీవితానికి ఎంతో ఉపయోగకరం అని ఆయన వివరించారు.
కడప మెత్రసనం అపోస్తూలిక పాలన అధికారి బిషప్ గాలి బలి. తండ్రి గారి ఆదేశాల మేరకు, కడప నగర పరిధిలోని మూడు విచారణల లోని 18 సంవత్సరములు నిండిన యువతీ యువకులకు,21,22,శని,ఆదివారలలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో వివాహ జీవితం పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సదస్సులో పాల్గొని, వివాహ జీవితం గురించి విలువైన  విషయాలను సూచనలు, సలహాలు తెలుసుకుని ఆదర్శవంతమైన భార్యాభర్తలుగా జీవితం గడుపుటకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Related Posts