YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంట్రాగ్రిడ్ పనులను వేగవంతం చేయాలి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశం

ఇంట్రాగ్రిడ్ పనులను వేగవంతం చేయాలి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డా.ఎస్.కె.జోషి ఆదేశం

మిషన్ భగీరథ పథకం ద్వారా మే 31 నాటికి గ్రామాలకు బల్క్ సప్లయ్ అందించే మంచినీటి పనులన్నీ పూర్తి చేయడంతో పాటు ఇంట్రాగ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డా.ఎస్.కె.జోషి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం సచివాలయంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై జిల్లాల ఎస్ఈ లు సిఈ లతో సి.యస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సి.యస్ జిల్లాల వారిగా సమీక్షిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ పనులను నిత్యం సమీక్షిస్తున్నారని, ఇంట్రాగ్రిడ్ పనులను సత్వరం పూర్తి చేసి, గ్రామాలలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.  గ్రామాలలో ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు అవసరమైన మెటీరియల్ కు సంబంధించి నివేధికను వెంటనే ఇఎన్సికి సమర్పించాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన స్ధలాలను ఎంపిక ప్రక్రియను సత్వరం పూర్తి చేసి పనులను 100శాతం గ్రౌండింగ్ చేయాలన్నారు  సి.ఈల వారిగా ఇంటిగ్రేటేడ్ పనులు, బల్క్ సప్లయ్ పనులు పూర్తి అయిన జిల్లాలు, గ్రామాల వివరాలను వెంటనే లకు సమర్పించాలన్నారు.  చాలా జిల్లాలో బల్క్ సప్లయ్ కు సంబంధించి ట్రయల్ రన్ పూర్తయి ప్రారంభానికి  సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సి.యస్ కు వివరించారు. ఈ సమావేశంలో సి.యం ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్ సి సురేందర్ రెడ్డి, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రాం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts