కాకినాడ
ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం కలకం రేపింది. గురువారం ఉదయం కారులో డ్రైవర్ను తీసుకెళ్లిన ఎమ్మెల్సీ, అర్ధరాత్రి యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున రెండు గంటలకు డ్రైవర్ తల్లిదండ్రులకు తన కారులోనే మృతదేహాన్ని తీసుకు వచ్చారు. మృతదేహాన్ని కింద కుదించాలని తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏం జరిగిందని ఆరా తీసిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా అయన వేరే కారులో వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం వుండిపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ వద్ద పనిచేస్తున్నాడు.