YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెరపైకి శ్రీకృష్ణ జన్మభూమి

తెరపైకి  శ్రీకృష్ణ జన్మభూమి

లక్నో, మే 20,
జ్ఞానవాపి మసీదు సర్వే వివాదం కొనసాగుతుండగానే.. మథురలో అలాంటి పిటిషన్‌లే దాఖలయ్యాయి. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంతానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు అంగీకరించింది మథుర కోర్టు. ఇంతకీ అక్కడ వివాదం ఏంటి?వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదులో నమాజు ఆపాలంటూ మథుర కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. దీంతో మసీదులు..మందిరాల మధ్య వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. శ్రీకృష్ణ అవతార పరిసమాప్తికి.. కలియుగ ప్రారంభానికీ లంకె ఉంది. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. గోపాలుడు పుట్టింది మథురలోనే అని అశేష ప్రజానీకం విశ్వాసం. హిందువులు శ్రీకృష్ణ జన్మస్థలంగా భావించే చోట ప్రస్తుతం ఈద్గా మసీదు ఉంది.శ్రీకృష్ణ జన్మస్థానం ఆలయానికి సంబంధించిన కీలక ఘట్టం 1968లో జరిగింది. శ్రీకృష్ణ జన్మస్థాన్ సంఘ్, షాహి ఈద్గా.. రాజీ ఒప్పందానికి వచ్చాయి. ఆలయ భూమిని.. షాహి ఈద్గా మేనేజ్ మెంట్‌కి కేటాయించింది. అయితే శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్‌కి ఆ భూమిపై ఎలాంటి అధికారం లేకున్నా కేటాయింపులు జరిపారన్న అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 1968 నాటి ఒప్పందాన్ని సవాల్ చేయడంతో పాటు ప్లేసెస్‌ ఆఫ్‌ రిలీజియన్ వర్షిప్ యాక్ట్‌ 1991ని రద్దు చేయాల్సిందిగా పిటిషన్లు దాఖలయ్యాయి.గత ఏడాది, న్యాయవాది రంజనా అగ్నిహోత్రితో పాటు మరో ఆరుగురితో కలిసి గతేడాది సివిల్ జడ్జి కోర్టులో ఈ కేసులో దావా వేశారు. పిటిషనర్లలో ఎవరూ ఈ సమస్యలో చెల్లుబాటు అయ్యే వాటాను కలిగి ఉన్న మధురకు చెందినవారు కానందున అది నిర్వహించదగినది కాదని పేర్కొంటూ సివిల్ జడ్జి పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఈ నిర్ణయాన్ని జిల్లా కోర్టులో సవాలు చేశారు. అక్కడ ట్రస్ట్, ఆలయ నిర్వహణ అధికారాన్ని పార్టీలుగా మార్చారు. శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ రాజీ ఒప్పందానికి పార్టీ కాదని మరియు భూమి యజమాని ట్రస్ట్ తరపున రాజీకి వచ్చే హక్కు సమాజానికి లేదని పేర్కొంది.శ్రీకృష్ణ ఆలయానికి చెందిన 13.37 ఎకరాల భూమిని తిరిగి పొందాలని భగవాన్ శ్రీకృష్ణ విరాజ్ మాన్ ట్రస్టు కోర్టులో సివిల్ పిటిషన్ వేసింది. ఇందులో భాగంగా ఆలయానికి పక్కనే ఉన్న ఈద్గా మసీదును తొలగించి మొత్తం భూమిని ఆలయానికి అప్పగించాలని పిటిషన్‌లో కోరింది. మసీదు వివాదంపై ట్వీట్‌లో స్పందించారు అడ్వకేట్‌ ముఖేష్ ఖండేల్వాల్‌. దీనిపై గతంలోనే కింది కోర్టులు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Related Posts