నెల్లూరు
నెల్లూరు జిల్లా పరిధిలోని ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్థిగా ఖరారు కాబడిన ఆత్మకూరు వైసీపీ ఇన్ చార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి 2వ రోజు మర్రిపాడు మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజుపాడు గ్రామంలో పర్యటించి,ప్రభుత్వ సంక్షేమ పథకల అమలవుతున్న తీరు ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు .గడచిన 3 సంవత్సరాలలో ప్రభుత్వం తరఫున వచ్చిన పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం ద్వారా ఆయా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు . త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.