బెంగళూరు
భారీ వర్షాలతో కర్నాటక వికలమైంది. గతంలో ఎన్నడూ లేని విదంగా కుండపోత వర్షాలు ప్రజలు నానా ఇబ్బందులకు గురి చేశాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీనజీవనం స్ధంభించి పోవడంతో వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. బెంగళూరులో ఒక్కరోజులోనే 10 సెంటీ మీటర్లకు పైగా కురిసిర వాన రికార్డు కెక్కితే ... ఇంకా ముంపు ముంగిట్లో ఉన్న ప్రాంతాల ప్రజల అవస్ధలు వర్ణణాతీతంగా మారాయి. వాయిస్ ... భారీ వర్షాల ప్రభావంతో కర్ణాటకలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఇళ్లు, అపార్టు మెంట్ల ఇలా జలదిగ్బదంలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. దీంతో నేరుగా సిఎం బసవరాజ బొమ్మై వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్ధితిపై అద్యయనం చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్ధలు పునరావృతం కాకుండా ఉండేలా సుమారు 1600 కోట్లతో బెంగళూరులోని డ్రైనేజీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఇళ్లలోకి నీరుచేరి నష్టపోయిన వారికి 25 వేలు పరిహారం అందిస్తామని భరోసా నిచ్చారు. ఈ క్రమంలో సిఎం ముందు భాదితులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంపుప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం చేరినప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టలేదని బాధిత ప్రజలు ఆగ్రహించారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చా రు. మరోవైపు కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక రహదారులు కూడా దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలోని పలు ఆనకట్టల్లో నీటి మట్టం పెరిగింది. కృష్ణరాజసాగర్, కబిని, హరంగి, హేమావతి, ఆల్మట్టి, నారాయణపుర, భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ వంటి ఆనకట్టలు నిండుకుండలా మారాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.