న్యూ డిల్లీ మే 20
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్విట్టర్ వేదికగా జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను చూసి ఈ దేశం గర్వపడుతుందని రామ్‌నాథ్ పేర్కొన్నారు. జరీన్ విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి కలలను నేరవేర్చుకునేందుకు జరీన్ విజయం ప్రేరణ కలిగిస్తుందని నమ్ముతున్నానని ఆయన తెలిపారు. నిఖత్ జరీన్ ఈ దేశానికి మరిన్ని అవార్డులు తీసుకురావాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు.గురువారం ఇస్తాంబుల్ వేదికగా జరిగిన మహిళల 52కిలోల ఫైనల్ పోరులో నిఖత్ 5-0 తేడాతో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్‌పాంగ్ జుటామస్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. మూడు రౌండ్ల పాటు జరిగిన పసిడి పోరులో జరీన్ 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో జిట్‌పాంగ్ సంపూర్ణ ఆధిక్యంతో గెలుపును ఖరారు చేసుకుంది.