YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం

దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం

న్యూఢిల్లీ మే 20
దిశ కేసులో ఊహించిన ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.  ఈ క్రమంలో సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ద్వారా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం. పోలీసులే మాన్యువల్‌కు విరుద్దంగా విచారణ జరిపారు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తక్షణ నాయ్యం కోసమే ఎన్‌కౌంటర్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకుండా విచారణ పేరుతో వేరే అధికారులు వారిని వేధింపులకు గురి చేశారు. పోలీసులు గాయాలతో ఆసుపత్రిలో చేరడం ఓ కట్టుకథ అని నివేదికలో పేర్కొన్నట్టు నిందితుల తరఫు లాయర్‌ ఆరోపించారు. ఈ మేరకు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను ఆయన మీడియాకు అందించారు. సిర్పూర్‌కర్‌ కమిషన్‌ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు పంపించింది. సిర్పూర్‌కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐని లాయర్‌ శ్యామ్‌దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏమి లేదని.. దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తాము కమిషన్ వేశామని.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు. దానికి అనుగుణంగానే ముందుకెళ్తామని సీజేఐ వెల్లడించింది. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ పేర్కొన్నారు. నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ స్పష్టం చేశారు. దిశా కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపించేశారు.

Related Posts