విజయవాడ మే 20,
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. సీఎస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. జస్ట్ సింపుల్‌గా పీఏకు పేపర్ ఇచ్చి వెనక్కి వచ్చేశారు. ఇది కుట్ర పూరితంగానే జరిగిందంటూ సంచలన కామెంట్ చేశారు ఏబీవీ.తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్రావు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయిటింగ్ పీరియడ్‌గా పరిగణిస్తామని ఉత్తర్వులివ్వడాన్ని తప్పుబట్టారు ఏబీవీ. తాను తప్పు చేస్తే శిక్షించాలని.. మీడియాలో బురదజల్లే ప్రయత్నం చేయొద్దని కోరారు.