YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతు బజార్ లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం

రైతు బజార్ లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం

అమరావతి
శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల  టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన టమాటా విక్రయాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని మంత్రి తెలిపారు.
సరసమైన ధరలకు ప్రభుత్వం విక్రయించే టమాటాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు రైతు బజార్ లలో పెద్ద ఎత్తున బారులు తీరారన్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, పల్నాడు,  ఏలూరు, విశాఖపట్నం రైతు బజార్ లలో టమాటాల విక్రయాలకు ప్రజల నుండి మరింత పెద్ద ఎత్తున స్పందన కనిపించిందని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్ లోని ధరల కంటే రైతు బజార్ లలో  విక్రయించిన టమాటాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని, కేజీ పై సుమారు రూ.15/- ల వరకు తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు.  శుక్రవారం  రైతుబజార్ లలో నిర్వహించిన టమాటా విక్రయాలు కొన్ని గంటల్లోనే పూర్తి అయిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Posts