కడప
కడపజిల్లా ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ పరిధి లోని చౌడూరు గ్రామ బైపాస్ లో శుక్రవారం అర్థరాత్రి సుమారు 1.00 గంట సమయంలో దారి దోపిడి జరిగింది. అనంతపురం టౌన్ చెందిన పతంగే తుకారాం, హతంచే శివనాగేశ్వరరావు అను ఇద్దరు ఆయుర్వేద మందుల తయారీ, డెలివరీ చేసి వ్యాపారం చేస్తూ ఈ వ్యాపార క్రమంలో తమ కారులో అనంతపురం నుండి ప్రొద్దుటూరు కి వచ్చారు. ప్రొద్దుటూరు లోని ఇసుకతిన్నెల ప్రాంతంలో మందులు డెలివరీ చేసి తిరిగి అనంతపురం పోతుండగా గా చౌడూరు గ్రామం దాటిన తర్వాత బైపాస్ నందు ఐదు మంది గుర్తుతెలియని వ్యక్తులు కారు పంచర్ అయ్యేలా చేశారు. ఇద్దరు వ్యక్తులు కారు పక్కకు ఆపి స్టెప్నీ టైర్ మార్చుకుంటూ ఉండగా పై ఇద్దరు వ్యక్తులపై రాళ్లతో దాడి చేసి, వారి వద్ద ఉన్న 20 వేల రూపాయల డబ్బులు, మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, మూడు సెల్ లను తీసుకుని పక్కనే ఉన్న పొలాల్లోనికి పారిపోయారు.