విజయనగరం
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. తనపై చాలా కేసులు పెట్టారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పోలీసులు పెట్టిన కేసులు ఫ్లూట్ వాయించినట్లు ఉందని.. జింక ముందు వాయించు.. తన ముందు కాదు బ్లడీఫూల్ అంటూ మామ బాలయ్య రేంజ్లో డైలాగ్ చెప్పారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. రాబోయే రెండేళ్లలో యుద్ధం చేయాల ని.. ఎన్నికల్లో అందరం కష్ట పడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పుంగనూరులో 75 ఏళ్ల వృద్ధుడు ఛాలెంజ్ చేశారని.. యువకులం ఇంకా దూకుడు పెంచుదామంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఎవరు భయపడొద్దు.. తాను అండగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా చూపిస్తానన్నారు.కార్యకర్తల ఆదరణ మరువలేను.. మళ్ళీ వస్తాను ఇదే వీధిలో నడుస్తాను.. తొడకొట్టి మీసం మెలివెస్తానన్నారు.కోడి కత్తి ప్రోగ్రాం కాదని.. జగన్ మోసపు రెడ్డి తెలుగు తమ్ముళ్ల సత్తా ఇది అన్నారు. అక్క.. చెల్లి, అవ్వ, తాత ఒక్క ఛాన్స్ అన్నారని.. అందరి జీవితం మారుస్తానన్నారని.. కానీ ధరలు పెంచి ప్రజల జీవితాలు మార్చారన్నారు. రాష్ట్రంలో 2 లక్షల 30 వేల పెండింగ్ పోస్టులు భర్తీ అన్నారని.. కనీసం 23. పోస్టులు కూడా భర్తీ చేయలేదన్నారు.
కాకినాడలో ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపి, తన కార్లో తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా సృష్టించిన గొప్ప నాయకు లు జగన్ ప్రభుత్వంలో ఉన్నారన్నారు.టీడీపీ కార్యకర్త లపై గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల కేసులు పెట్టారని.. తనపైనా 14 కేసులు పెట్టారని గుర్తు చేశారు. నర్సీపట్నం దళిత డాక్టర్ సుధాకర్ పిచ్చివాడిని చేసి.. గుండెపోటు వచ్చేలా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. గంజాయి మత్తులో పెద్ద ఎత్తులో మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు.