అమరావతి మే 21
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు శత జయంతి ఉత్సవాల నిర్వహణ వివరాలను ప్రకటించారు. మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు జరుగుతాయని పేర్కొన్నారు.తమ కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామన్నారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని,శక పురుషుని శత జయంతి పేరుతో వేడకలను నిర్వహిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.