YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఖైదీ నెంబ‌ర్ 241383..మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ

ఖైదీ నెంబ‌ర్ 241383..మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ

పాటియాలా మే 21
ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు యేడాది పాటు జైలు శిక్ష ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే త‌న‌కు ఛాతీ నొప్పి రావ‌డంతో ఆయ‌న్ను మాతా కౌస‌ల్య ఆస్ప‌త్రికి పోలీసులు తీసుకెళ్లారు. పరీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే.. జైలు అధికారులు సిద్ధూకు ఖైదీ నెంబ‌ర్ 241383 ఇచ్చారు. బ్యార‌క్ నెంబ‌ర్ 7 ను సిద్దూకు కేటాయించారు.జైలులో సిద్ధూకు ఓ టెబుల్‌, రెండు ట‌ర్బ‌న్లు, ఓ క‌ప్‌బోర్డు, బ్లాంకెట్‌, రెండు ట‌వ‌ల్స్, దోమ తెర‌, ఓ పెన్ను, నోట్‌బుక్‌, షూలు, రెండు బెడ్‌షీట్స్, నాలుగు జ‌త‌ల కుర్తా పైజామా సిద్ధూకు ఇచ్చారు. అయితే సిద్దూ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే వుంద‌ని జైలు అధికారులు పేర్కొన్నారు.38 ఏళ్ల కింద‌టి ఓ కేసులో సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష ప‌డ్డ విష‌యం తెలిసిందే.పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది.

Related Posts