YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రొటెం స్పీకర్ గా బోపయ్య

ప్రొటెం స్పీకర్ గా బోపయ్య

అసెంబ్లీలో శనివారం బలపరీక్ష నిర్వహించనున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించారు. ఆయన 2009 నుంచి నాలుగేళ్లపాటు కర్ణాటక స్పీకర్‌గా పని చేశారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా హస్తం పార్టీకి చెందిన సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండేకు అవకాశం కల్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ గవర్నర్ మాత్రం అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన నేతకే ఆ పదవి కట్టబెట్టారు. స్పీకర్ నియామకం పూర్తయ్యే వరకు ప్రొటెం స్పీకర్ ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నిక సాధారణంగా సభలో సీనియర్ సభ్యుణ్ని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. కానీ బలపరీక్ష నేపథ్యంలో గవర్నర్ మాత్రం సీనియర్ అయిన దేశ్‌పాండే‌ను కాదని విరాజ్‌పేట్‌కు చెందిన బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఈ క్రమంలో కర్ణాటక శాసనసభలో ప్రొటెం స్పీకర్ పాత్ర కీలకం కానున్నది. కర్ణాటక అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికైన ఆర్‌వీ దేశ్‌పాండేను.. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీ సెక్రటేరియట్ సిఫార్సు చేసింది. దేశ్‌పాండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో.. ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ పాత్ర  బలపరీక్షలో కీలకంగా మారనుందని సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ ను చేరుకోవాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందడంతో స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం లేదు. ఒక వేళ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తే కాంగ్రెస్ - జేడీఎస్ తమ అభ్యర్థిని స్పీకర్ పదవికి నిలబెడుతాయి. ఈ సమయంలో కాంగ్రెస్ - జేడీఎస్ అభ్యర్థి గెలిస్తే.. బలపరీక్ష కంటే ముందే బీజేపీ ఓడినట్లు అవుతుంది. యడ్యూరప్ప వైదొలగక తప్పదు. ఈ ఇబ్బందికర పరిస్థితులను బీజేపీ అధిగమించాలంటే.. ప్రొటెం స్పీకర్‌తోనే బలపరీక్ష నిర్వహించుకోవాలి. రాజ్యాంగపరంగా.. ఇతర స్పీకర్లకు ఉన్నట్లే ప్రొటెం స్పీకర్‌కు అన్ని అధికారాలు ఉంటాయి. అయితే బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలు ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే.. తక్షణమే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ ఆ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. బీజేపీ బలనిరూపణ చేసుకోవడం అసాధ్యమే.

Related Posts