విశాఖపట్నం
విశాఖజిల్లాలో అటవీ శాఖ గనులు,విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పలు అభివృద్ధి పనులు పై మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.సమీక్షలో పౌర సరఫరాల శాఖా మంత్రి నాగేశ్వరరావు,మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పాల్గోన్నారు.మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని,రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని కానీ సబ్ స్టేషన్లలో విధులు నిలిపివేసి ప్రభుత్వంపై బురద జల్లడం టిడిపి నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్రిక్ ప్లే చేశారని,దీనికి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.ప్రమాదకర పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 374 పరిశ్రమలు వున్నాయని,కాలుష్య ప్రభావిత తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు.విశాఖలో 81శాతం ఉన్న కాలుష్యాన్ని 60 శాతానికి తగ్గిస్తామని,28 వేల మంది రైతులకు స్మార్ట్ మీటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేశామని,ఫలితంగా విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు.