YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జైల్లో చాలా నేర్చుకున్నాను

జైల్లో  చాలా నేర్చుకున్నాను

ముంబై, మే 21,
షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీ బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. సుప్రీం కోర్టు రూ.2 లక్షల పూచీకత్తు మీద బుధవారం ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. శుక్రవారం సాయంత్రం ఆమె ముంబైలోని బాకుల్లా జైలు నుంచి బయటకొచ్చారు. తెల్లటి దుస్తుల్లో బయటకొచ్చిన ఆమె.. ఇప్పటికైతే తనకు ఎలాంటి ప్లాన్లు లేవన్నారు. ఆరున్నరేళ్ల తర్వాత ఆమె తిరిగి సాధారణ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇన్నేళ్ల తర్వాత ఆకాశాన్ని చూడగలుగుతున్నా.. చాలా సంతోషంగా ఉందన్నారు.
‘జైల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.. నా తదుపరి ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడతాను. సహానుభూతి, క్షమాతత్వాన్ని నేను నమ్ముతాను’’ అని ఇంద్రాణీ తెలిపారు. ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఆమె రెండు వారాల్లోగా రూ. లక్షల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. 2012లో షీనాను కిడ్నాప్ చేసి.. గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ముంబై శివార్లలో ఓ గోతిలో శవాన్ని పడేశారు. ఇంద్రాణితోపాటు మీడియా అధిపతి అయిన ఆమె మాజీ భర్త పీటర్ ముఖర్జీయా, మరో ఇద్దరు సైతం ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో పీటర్ జైలుకెళ్లొచ్చారు.ఓ దశలో పవర్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఇంద్రాణీ, పీటర్ దంపతులు.. 2007లో ఐఎన్ఎక్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. కానీ రెండేళ్ల తర్వాత నిధుల దుర్వినియోగం ఆరోపణలతో తమ వాటాను విక్రయించారు. 2008లో విదేశాల నుంచి కోట్లాది రూపాయల పెట్టుబడులను అక్రమంగా వ్యాపారంలోకి మళ్లించడంలో వీరిద్దరికీ కార్తీ చిదంబరం సహకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది.

Related Posts