తిరువనంతపురం మే 21,
ఆమ్ ఆద్మీ పార్టీ.. దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించింది.. ఒకప్పుడు ఢిల్లీకే పరిమితమైన ఆప్.. పంజాబ్‌లో సైతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని పలు రాష్ట్రాలపై కన్నేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆప్‌ను బలమైన శక్తిగా రూపొందించేందుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా కేరళలో పర్యటించారు. అయితే.. రాష్ట్ర రాజకీయాలను అవినీతి నుంచి ప్రక్షాళన చేయడానికి.. సంక్షేమ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి కేరళకు వచ్చానని.. ఢిల్లీ-పంజాబ్ మోడల్‌ను కేరళలో పునరావృతం చేయాలనుకుంటున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇది విన్నప్పుడు ఆసక్తికరంగా అనిపించినా.. కేరళో ఆప్ అధినేత పాచికలు పారతాయా..? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారిందంటూ వ్యాసకర్త డా. జె ప్రభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్9తో పలు విషయాలను పంచుకున్నారు.కొచ్చి సమీపంలోని కిజక్కంబళంలో జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2020 ఫార్ములా.. రాజకీయాలను ప్రశ్నించని నాయకుడు సాబు M. జాకబ్ రాజకీయ కార్యకలాపాల మాట్లాడటం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. KITEX గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా ఉన్న సాబు జాకబ్.. కార్పొరేట్ నాయకుడిగా మారిన రాజకీయవేత్తగా గమనించవచ్చు. పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ (PWA) అనే కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఇద్దరు నేతలు ఈ వేదికపై ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో నాలుగో రాజకీయ ఫ్రంట్ ఆవిర్భవించింది. ఇంకా రాష్ట్రంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉన్నాయి..ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమ్ ఆద్మీ అధినేత తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని.. ఏది జరిగినా అది సర్వశక్తిమంతుడైన దేవుడి వల్లనే అని ఒప్పుకునేంత స్థితిలో ఉన్నారు.. ఇద్దరు ‘రాజకీయేతర’ నాయకులు రాజకీయ కూటమిని ఏర్పరుచుకోవడం.. అది కూడా లోతైన రాజకీయ సమాజంలో ఊహజనితంగా అనిపిస్తుంది.కేజ్రీవాల్ కిజక్కంబలం ప్రసంగంలో.. రెండు ముఖ్యమైన అంశాలు ఉద్భవించాయి.. AAP ప్రాథమికంగా దాని రాజకీయ బలం కోసం ట్వంటీ20 రాజకీయ కూటమిపై ఆధారపడి ఉంటుంది. సంక్షేమం, అవినీతిని నిరోధించడం వారి రాజకీయ నినాదంగా మారనుంది. అరవింద్ కేజ్రీవాల్, సాబు జాకబ్ ఇద్దరూ తమ ‘నాన్-పొలిటిక్స్’ విధానంతో రాజకీయంగా బలంగా మారేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టమవుతుంది. ఇది వారి ఆశయానికి ఏ మేరకు ఉపయోగపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే.. వారి వ్యూహం కేరళ రాజకీయాలను మారుస్తుందా..? లేదా అనేది చూడాల్సి ఉంది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
2020 రాజకీయాల్లో CSR ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పనిసరి.. కార్పొరేట్ శైలిలో రాజకీయాలను నడుపుతున్న వారికి వ్యాపార సంస్థల అండ దీనికి ఉదాహరణ. ఇందులో సైద్ధాంతిక రాజకీయాలతో పెనవేసుకున్న కేరళ భవిష్యత్తు.. అభివృద్ధి గురించి రూపొందించిన బ్లూప్రింట్ లేదు. క్లుప్తంగా చెప్పాలంటే.. సాబు జాకబ్ రాజకీయాలపై అవగాహన లేని కారణంగా.. కొన్ని సార్లు రాజకీయ వ్యతిరేక దుష్ప్రచారాలకు కూడా ఎదుర్కొన్నారు. పైగా ఎర్నాకులం జిల్లాలోని కొన్ని స్థానిక సంస్థల పరిధులు దాటి, కేరళలో ఎక్కడా 2020కి బలం లేదు. దీనికి మరెక్కడా సంస్థాగత ఉనికి కూడా లేదు.ఈ వాస్తవాలను చూస్తే.. కేజ్రీవాల్ ట్వంటీ 20పై ఆధారపడటం సమీప భవిష్యత్తులో అతని పార్టీ మంచి స్థానంలో నిలుస్తుందా అనేది సందేహమే. ఇంకా, కేరళ ప్రజల విషయానికొస్తే ఆమ్ ఆద్మీ పార్టీని చిన్నదిగా చూస్తారు. మలయాళీలు దేశమంతటా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ వారి రాజకీయాలు ఎల్లప్పుడూ స్థానికంగానే ఉంటాయి. వారు ఇతరుల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో లేదా పంజాబ్‌లో చేసిన పనికి.. కేరళీయులకు రాజకీయ ఆకర్షణ ఉండదు.. అని ప్రభాష్ పేర్కొన్నారు.ఒక విషయం ఏమిటంటే.. దేశంలోని ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల్లో లోటు లేదు. ఇది వాస్తవికత విరుద్ధమైన దిశను సూచిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాలలో కేరళ తరహాలో చర్యలు లేవు. దాని బడ్జెట్ కేటాయింపులో మంచి భాగాన్ని వారు వెచ్చించే ఖర్చుల కోసం కేటాయించారు. ఇందులో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లు రెచ్చిపోతున్నాయని చరిత్ర చెబుతోంది. మళ్ళీ కేరళలో అవినీతి ఉనికిని కొట్టిపారేయలేకపోయినా, అనేక ఇతర రాష్ట్రాల్లో ఉన్నందున ఇక్కడ అది తీవ్రమైన సమస్య కాదు. అందువల్ల ఆప్ ‘సంక్షేమ-అవినీతి రాజకీయాలు’, అత్యంత దృడమైన రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించడంలో సహాయపడవు.ఇది కేరళలోని అసలు సమస్యను మనకు సూచిస్తుంది. దాని ఆర్థిక వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అదే సమయంలో, పేదలు, మధ్య తరగతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను నిలుపుకోవడం. భారతదేశంలో అత్యంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అలాగని, అధికారాన్ని ఆశించే వారెవరైనా అప్పు తర్వాత పరిస్థితుల గురించి ఆలోచించాల్సిందే. నిజానికి ప్రజలకు కావాల్సింది కేవలం సస్యశ్యామలం చేసే పెన్షన్‌లు కాదు, అర్థవంతంగా జీవించేందుకు సహాయపడే నిజమైన ఆదాయాలు. దీని కోసం యువతకు లాభదాయకమైన ఉపాధి, ఉపాధి నైపుణ్యాలు, నాణ్యమైన విద్య అవసరం. ఉపాధి సంక్షేమం లాంటి పథకాలపై ప్రజలు ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది రాష్ట్రానికి దాని ఆదాయ వ్యయంలో గణనీయమైన భాగాన్ని ఉపశమనం కల్పిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిపై కేజ్రీవాల్ ఏమంటారో చూడాలి.ఇంకా, కేరళలో పర్యావరణ విపత్తు సమస్యగా ఉంది. మానవ-జంతు సంఘర్షణల పరంగా లేదా అంటు వ్యాధుల వ్యాప్తి లేదా తరచుగా వరదలు లాంటి విపత్తుల పరంగా పర్యావరణ సమస్యలు రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల ఆర్థికసాయం కూడా పోతుంది. దీనిపై ప్రముఖ రచయిత్రి, మార్గరెట్ అట్వుడ్ ఒకప్పుడు ఇలా అన్నారు.. ఆర్థిక వ్యవస్థ అనేది పర్యావరణం పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. కాబట్టి, ఇలాంటి సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. దీనిపై ఆప్ తన మనసుతో ఆలోచిస్తుందా..?
ఢిల్లీ, పంజాబ్‌లో పరిస్థితి ఇది..
ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రను పరిశీలిస్తే.. అది దీర్ఘకాలికంగా ఉనికిలో ఉన్న రాజకీయ నాయకులు అప్రతిష్టపాలు అయిన రాష్ట్రాల్లో చాలా ప్రయోజనాలను పొందిందని స్పష్టమవుతుంది. పంజాబ్‌తోపాటు ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. అయితే కేరళలో రాజకీయ వాస్తవికత దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతానికి, సంఘటిత వామపక్షాలు పూర్తి స్థాయిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల నుంచి యుడిఎఫ్‌ని తొలగించే సమయం ఇంకా ఆసన్నం కాలేదు. మరోవైపు, బీజేపీ ఉనికి చాలా తగ్గిపోయినప్పటికీ, ఇప్పటికీ గుర్తించదగినది. దీని అర్థం ఏంటంటే..? నాల్గవ కూటమికి అత్యంత తక్కువ స్థలం ఉంది. ప్రత్యేకించి చిపురు పార్టీకి తగిన బలమైన సంస్థాగత ఉనికి లేదు.దీనికి తోడు కేజ్రీవాల్‌ను చాలా మంది ‘విముఖ లౌకికవాది’గా చూస్తున్నారు. హిందూ మతతత్వానికి సంబంధించిన సమస్యలపై, మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఆయన తరచుగా మెతక వైఖరిని అవలంభిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు జనాభాలో దాదాపు సగం మంది ఉన్న రాష్ట్రంలో.. ఆమ్ ఆద్మీ రాజకీయ అవకాశాలపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమస్యలపై పార్టీ, దాని నాయకత్వం తమ వైఖరిని స్పష్టంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.ప్రజలు తమ అడుగులతో ఓటు వేస్తారు” అని లెనిన్ చెప్పిన ప్రసిద్ధ సూక్తి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాలలో విజయానికి ఏకైక సూత్రం.. కోటి ఆందోళనల చుట్టూ ప్రజలను సమీకరించడం. PWA వంటి కూటమి అభివృద్ధి చెందుతున్న కూటమికి ఇది అత్యంత బలీయమైన అడ్డంకి కానుందని చెప్పలేం.రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అన్నది నిజం. అయితే.. జాతీయ అత్యవసర పరిస్థితిని అనుసరించి 1977లో జాతీయ స్థాయిలో జరిగినట్లుగా ఏదైనా ప్రత్యామ్నాయ సమీకరణలు వస్తే తప్ప అలాంటి వాటిని అంచనా వేయలేం. కానీ సమకాలీన కేరళకు సంబంధించినంత వరకు ఇది చాలా దూరంగా ఉంది. ఇక్కడి ప్రజలకు ఇప్పుడు ఎలాంటి తీవ్రమైన కోపాలు..కానీ సమస్య కానీ లేదు. ఇంకా ట్వంటీ 20 పొత్తులో AAP కూడా లేదు.. సమీప భవిష్యత్తులో అలాంటిది జరిగితే దానిని ఉపయోగించుకునేంత సామర్థ్యం కూడా AAPకి లేదని వ్యాసకర్త సుభాశ్ పేర్కొన్నారు.