విశాఖపట్టణం, మే 23,
విశాఖ రాజధాని అని జగన్ మనసులో ఏనాడో కన్ ఫర్మ్ చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆరు నెలల తరువాత నిండు సభలో ఆయన దాన్ని చల్లగా ప్రకటించారు. పేరుకు మూడు రాజధానులు అంటున్నా టోటల్ పాలనతో పాటు కంప్లీట్ యాక్టివిటీనే విశాఖకు షిఫ్ట్ చేయాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును చట్టం చేసి కూడా ఏడాది అవుతోంది. న్యాయ స్థానాల్లో ఆ కేసు ఉందిపుడు. దాంతో జగన్ ఏం చేయలేకపోతున్నారు. అయితే బ్యాక్ డోర్ నుంచి తాను చేయాలనుకున్నది చేస్తూ విశాఖలో మెల్లగా కధ నడిపిస్తున్నారు అంటున్నారు.విశాఖ విషయంలో తగ్గేది లేదు అన్నట్లుగానే జగన్ వైఖరి ఉంది. తాజాగా మంత్రి వర్గ సమావేశంలో విశాఖలో టూరిజం ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా విశాఖ నుంచి భోగాపురం దాక బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టులను చేపట్టాలని కూడా జగన్ సర్కార్ భావిస్తోంది. ఇక కోస్తా తీరం వెంబడి ఆరు లైన్ల రహదారులను నిర్మించాలని, ఈ ప్రాంతంలో ఉన్న పదకొండు బీచ్ లను గోవా తరహాలో అభివృద్ధి చేయాలని కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. తొలి దశలో కొన్ని పనులను చేపట్టడానికి అయిదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు.విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా అంటున్నారు. దానికి ఆయన కారణాలు చెబుతున్నా కొందరికి పట్టడంలేదు. దాంతో విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తద్వారా అతి పెద్ద ఆర్ధిక వనరుగా వైజాగ్ ని చూపించాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట. దేశంలో అతి చిన్న రాష్ట్రంగా ఉన్న గోవా కేవలం టూరిజం ద్వారానే వచ్చే ఆదాయంతో సంపన్నంగా ఉంటోంది. విశాఖలో కూడా గోవా తరహా టూరిజం ప్రాజెక్టులను టేకప్ చేయడం ద్వారా తక్కువ టైమ్ లో విశాఖను ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మార్చాలి అన్నదే జగన్ టార్గెట్ అని చెబుతున్నారు.విశాఖ నుంచే పాలన చేపట్టాలన్నది జగన్ కల. ఈ విషయంలో న్యాయ వివాదాలు కొలిక్కి రావడంలేదు. అవి ఎపుడు వచ్చినా కూడా అప్పటి నుంచే విశాఖను రాజధానిగా ప్రకటించి మొత్తం అన్నీ అక్కడికి తరలించాలన్నది జగన్ ఆలోచన అంటున్నారు. ఈ లోగా అభివృద్ధి కార్యక్రమాల పేరిట విశాఖను రాజధానికి అనువుగా మార్చేందుకు జగన్ గట్టిగానే కృషి చేస్తున్నారు. రాజధాని అన్న మాట ఎక్కడా అనకుండా అన్ని ప్రాంతాల పాటే ఇక్కడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడమే వైసీపీ సర్కార్ ఉద్దేశ్యం. అయితే విశాఖ ప్రాజెక్టుల వెనక మాత్రం క్యాపిటల్ సిటీ ప్లాన్ ఉందని అంటున్నారు ఏ కొత్త నిర్మాణం ఇక్కడ చేపట్టాలన్నా కూడా కోర్టులో కేసులు వేస్తున్నారు. దాంతో బ్యాక్ డోర్ నుంచే వ్యవహారాన్ని చక్కబెట్టాలన్నది జగన్ వ్యూహంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ, వుడాలను ఈ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ డెవలప్మెంట్ ఓరియెంటెడ్ ప్రొగ్రామ్స్ గా వాటికి రంగులు అద్దుతున్నారని టాక్. మరి జగన్ కలల రాజధాని విషయంలో కధ ఎటు వైపు సాగుతుందో చూడాలి.