YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కమలాన్ని కొంపముంచిన 8 సీట్లు

కమలాన్ని కొంపముంచిన 8 సీట్లు

త్రిముఖ పోరు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు అమీతుమీ తలపడి సీట్లను పంచుకున్నాయి. వీటిల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇక్కడితో కథ సుఖాంతం అయిపోలేదు. ఇప్పుడు బలనిరూపణ చేసుకోవడం బీజేపీకి అతి పెద్ద పరీక్ష అవుతోంది. అది కూడా రేపే బలపరీక్షను ఎదుర్కొనాల్సి రావడం బీజేపీని ఒకింత ఇబ్బంది పెడుతోంది.  ఏం జరుగుతుందో ఏమో అని కమలనాథులు ఆందోళనలో ఉన్నారు. మొత్తంగా మినిమం మెజారిటీకి మరో ఎనిమిది సీట్ల దూరంలో ఉన్నారు బీజేపీ వాళ్లు. విశేషం ఏమిటంటే.. కొన్ని సీట్లను భారతీయ జనతా పార్టీ అతి తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయింది. రెండు వందల, మూడు వందల ఓట్ల తేడాతో కోల్పోయిన సీట్లు కూడా ఉన్నాయి. ఇలా మొత్తంగా అతి స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన ఎనిమిది సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఎనిమిది సీట్లనూ కేవలం 6,730 ఓట్ల తేడాతో కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఈ 6,730 ఓట్లు గనుక బీజేపీకి పడి ఉంటే ఇప్పుడు కథ వేరేగా ఉండేది. ఆ నియోజకవర్గాల్లో ఆ ఓట్లు పడి ఉంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఢోకా ఉండేది కాదు. ఇంత రచ్చ జరిగేది కూడా కాదు. ఏడు వేల లోపు ఓట్ల తేడాతో ఎనిమిది నియోజకవర్గాలను కోల్పోవడం భారతీయ జనతా పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. 

Related Posts