YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యువత చేతిలో దేశ భవిష్యత్

యువత చేతిలో దేశ భవిష్యత్

దేశ భవిష్యత్తు యువత చేతిలో  ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. 'నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు.. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు.. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు.. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు..' అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

Related Posts