విజయవాడ,
స్థానిక 43వ డివిజన్ లోని 134వ సచివాలయం పరిధిలో 11వ రోజు సోమవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్ఆరు. ఊర్మిళ సుబ్బారావు నగర్ లోని మంగమ్మ కొట్టు రోడ్,కృష్ణ రెడ్డి రోడ్, తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూఈ సచివాలయంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు తెలిపారన్నారు. వాలింటర్స్ అధికారులు మంచి సేవలందిస్తున్నారన్నరు.ఈ ప్రాంతం లో అన్ని విధులు చిన్నవి కావటంతో డ్రైనేజ్ ఇబ్బంది బాగా వుంది అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు.కాలువలు చిన్నవి కావటం మురుగు పారాటం లేదు త్వరితగతిన అది పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.ప్రభుత్వ నిబంధనలకు లోబడే సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు.ప్రతి ఇంటి గడప దగ్గరకు సంక్షేమ పథకం ఇవ్వలనేదే జగన్ లక్ష్యం అన్నారు పార్టీ లతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందించడం జరుగుతుందన్నారు.టీడీపీ వాళ్లు నిర్వహించేది మహా నాడు కాదు మయా నాడు అని ఎద్దేవా చేశారు ముందు చంద్రబాబు తన బుద్ది మార్చుకోవలన్నారు.ఈ డివిజన్ లో వున్న తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో కూడా 5 పథకాలు వచ్చాయి అది తెలుసుకో చంద్రబాబు అంతే గానీ ప్రతి రోజు రాజకీయ విమర్శలు చేయడం సబబు కాదన్నారు.గతంలో ఎప్పుడూ కూడా మాకు ఈబిసి నేస్తం లాంటి పథకాలు మాకు అందలేదు అని తెలుగుదేశం నాయకుడు చెపుతున్నారన్నారు.ఎంత మంది కలిసి వచ్చిన వచ్చే ఎన్నికలో గెలిచేది వైకాపా అని ఆశాభావం వ్యక్తంచేశారు.చంద్రబాబు ఇంకా ఆంధ్ర రాష్ట్రంకి పనికి రాడన్నారు.పార్టీ వ్యతిరేకంగా తిరుగుతున్నారని సస్పెండ్ చేయడం జరిగింది పశ్చిమ లో వైకాపా దృఢంగా వుందని అవినీతిపరులు,బ్లాక్ మెలర్స్ కి పార్టీ ఎక్కడ దడవదన్నరు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా,43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి,కంది శ్రీనివాస్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు పగిడిపాటి చైతన్య రెడ్డి, కార్పొరేటర్లు,మరుపిళ్ల రాజేష్,ఇర్ఫాన్,ఆంజనేయ రెడ్డి,,యాలకల చలపతిరావు,నరేంద్ర రాఘవ, నాయకులూ రాయన నరేంద్ర,మైలవరపు దుర్గారావు,వెన్నం రజినీ, తంగెళ్ళ రాము, బంక విజయ వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.