నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి పై జరిగిన దాడిని పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు దేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ని అయన పరామర్శించారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళాధ్యక్షురాలు రేవతి పై వైసీపీ నాయకులు దాడి చేయించడం సిగ్గు చేటు. తన భర్త కప్పిర శ్రీనివాసులును అన్యాయంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఎందుకు పంపడం లేదని రేవతి ప్రశ్నిస్తే కొంత మంది మహిళల చేత ఆమె పై దాడి చేయిస్తారా. వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు,మాజీ, తాజా మంత్రులు దాడులను ప్రోత్సహించడం... సర్వేపల్లి నుంచి కావలి వరకు జిల్లా అంతటా అధికార వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం ఎంత వరకు న్యాయం. దాడులు చేయమని అధికార పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఏమైన లైసెన్స్ లు ఇచ్చారా...? మహిళ పై దాడి చేసి మీరు పెద్ద ప్రతాపం చూపించినట్లు ఫీల్ అవుతున్నారా...అందుకా రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఇళ్ల స్థలాల పేరుతో భూముల కొనుగోళ్లలో అక్రమాలు ఆ స్థలాల లెవలింగ్ పేరుతో దోపిడీ జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమాల పై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యేలు,మంత్రులను కాదని అక్రమాలను అడ్డుకునే ధైర్యం లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.
ఒక్క నెల్లూరు జిల్లాలోనే పేదల ఇళ్ల స్థలాల పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమాలకు అధికార వైసీపీ పార్టీ పాల్పడింది. జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే వాటిని నిరూపించుకోవాల్సిన అధికార పార్టీ నాయకులు మహిళలపై దాడులకు పాల్పడటం దుర్మార్గం. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.