కాకినాడ
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకినాడ పోలీసులు ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం మృతిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని దళిత, ప్రజాసంఘాలతో పాటు వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.