YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాపట్లలో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

బాపట్లలో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

బాపట్ల
బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో పలు బ్రాంచీల్లో పనిచేసిన దివ్యవాణి ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్ బ్యాంక్ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకుని ఉప్పాల శ్రీనివాసరావుకు అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు.
బ్యాంకులో పనిఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తెలపగా వారు ఆమెను సముదాయించి పంపారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న శ్రీనివాసరావు చూసే సమయానికి ఓ గదిలో సీలింగ్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది.
వెంటనే విషయాన్ని పోలీసులకు అందజేసారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related Posts