YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆఫీసర్... నా స్టోరీ నాగ్ కు జయకుమార్ లేఖ

ఆఫీసర్... నా స్టోరీ  నాగ్ కు జయకుమార్ లేఖ

విడుదలకు ముందే ‘ఆఫీసర్’ మూవీ చిక్కుల్లో పడింది. రామ్ గోపాల్ వర్మ, కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ మూవీ విడుదల కావాల్సిఉండగా.. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో వాయిదా వేస్తున్నట్టు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర కథ నాదే వర్మ కాపీ కొట్టేశాడు అంటూ జయకుమార్ అనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆఫీసర్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. నిజానికి వర్మ సినిమా అంటేనే వివాదం. టైటిల్ అనౌన్స్ మొదలు.. షూటింగ్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి విషయంలోనూ కంటెంట్ ఉన్నా లేకపోయినా కాంట్రవర్శి ఖచ్చితంగా కావాల్సిందే వర్మకు. చాలా సినిమాలకు హీరో, హీరోయిన్, పాటలు, మాటలు, పగిలి పోయే పంచ్‌లు, ఫస్ట్‌లుక్, ప్రోమో, టీజర్, ట్రైలర్ వీటితో సినిమాలకు పేరు రావడం చూస్తుంటాం. కాని వర్మ సినిమాలకు మాత్రం ఇవేం అవసరం లేదు. ఎక్కడో చిన్న పుల్ల పెడతాడు.. కట్ చేస్తే మీడియాలో ఫ్రీ ప్రమోషన్ షురూ. ఇదే ఫార్ములాను క్రమం తప్పకుండా ఫాలో అయిపోతుంటాడు వర్మ. 

ఇక తాజా ‘ఆఫీసర్’ చిత్రంలో నాగార్జున నటిస్తుండటంతో కాస్త వివాదాలకు దూరంగానే సినిమా తీసినా.. ఇన్నాళ్లు వర్మ అంటిపెట్టుకున్న ఉన్న వివాదాలు ఆయన్ని వదలడం లేదు. ఇటీవల తరుచుగా వర్మ కథలను కాపీ కొడుతున్నాడే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాదు కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల వర్మ సోషల్ మీడియాలో విడుదల చేసిన సంచలన వీడియో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ కూడా కాపీ కొట్టిందే అంటూ పి.జయకుమార్ అనే రచయిత కోర్టు కెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉంటే వర్మ డైరెక్షన్‌లో ముంబై మాఫియా నేపథ్యంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన కథ నాదే అంటూ గతంలో వర్మతో కలిసి పనిచేసిన జయకుమార్ అనే రచయిత ఆరోపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌తో వర్మ చేసిన ‘సర్కార్ 3‘ చిత్రానికి కథ అందించింది తానే అని.. ఆ సమయంలోనే మొత్తం 9 కథలను వర్మకు వినిపించానని. అయితే ఆ కథలన్నీ నచ్చలేదని పక్కన పెట్టిన వర్మ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు తీస్తున్నారని జయకుమార్ ఆరోపించారు. ఇటీవల విడుదలైన ‘ఆఫీసర్’ ట్రైలర్ చూశానని, దానిలో సన్నివేశాలు, డైలాగులు తాను రాసుకున్నవే కావడంతో షాకయ్యానని జయకుమార్ ప్రకటనలో వెల్లడించారు

Related Posts