న్యూఢిల్లీ మే 23
దేశంలో మరోసారి భారీ విధ్వంసానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్రపన్నింది. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని నిఘావర్గాలు పసిగట్టాయి. గూడ్స్ రైళ్లను అడ్డుకోవడానికి రైల్వే ట్రాక్‌ల విధ్వంసానికి పథకరచన చేసిందని, దీనికోసం తన సానుభూతిపరులకు పెద్దమొత్తంలో ఆర్థికసాయం అందిస్తున్నదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను నిఘావర్గాలు అప్రమత్తం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన స్లీపర్‌సెల్స్ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఎస్‌ఐ ధనం సమకూర్చుతున్న విషయం తెలిసిందే.