YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గిచాలి టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గిచాలి టీడీపీ అధినేత చంద్రబాబు

నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం...ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం లో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ట్వీట్టర్ లో అయన వ్యాఖ్యానిస్తూ పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయం  తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితం పై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుందని అన్నారు.
ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గతేడాది చివర్లో దేశంలో అనేక  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా...అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు.
ఇప్పుడు కేంద్రం పెట్రోల్పై రూ.8లు, డీజిల్పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేసారు? వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని అయన అన్నారు.

Related Posts