YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపుతున్న ఆత్మసాక్షి సర్వే

కలకలం రేపుతున్న ఆత్మసాక్షి సర్వే

విజయవాడ, మే 24,
ఇప్పటి కిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుంది?  అధికార వైసీపీ సీట్ల సంఖ్య సగానికి సగం తగ్గుతుంది. ప్రస్తుతమున్న 151 స్థానల్లో వైసీపీ కేవలం 75 నుంచి 77 స్థానాలు మాత్రమే నిలుపుకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 23 నుంచి ఇంచుమించుగా మూడు రెట్లు పెరుగుతుంది, 60 నుంచి 62 స్థానాల్లో  టీడీపీ విజయ కేతనం ఎగరేస్తుంది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేన ఈసారి 6 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుంది. ఇతరులకు ఒక సీటు దక్కుతుంది.  మరో 18 నుంచి 21 స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా, అన్న విధంగా గట్టి పోటీ ఉంటుంది. అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ, ఎవరికీ వారు ఒంటరిగా పొటీ చేస్తే, హంగ్ అసెంబ్లీ అనివార్యమవుతుంది. అవును, ఇది జోస్యం కాదు, శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితమే.. అయిత అదేదో అంతగా ఊరు పేరు లేని అనామక సంస్థ చేసిన సర్వే ఫలితం కాదు. 2019 ఎన్నికలలో, వైసీపీకి  139 నుంచి 142,( వాస్తవంగా వచ్చింది 151)  టీడీపీకి 22 -28, ( వాస్తవంగా వచ్చింది 23) జనసేనకు 0-2 ( వాస్తవంగా వచ్చింది 1) సీట్లు వస్తాయని, ఎగ్జిట్ పోల్ ఆధారంగా, వాస్తవానికి దగ్గరగా ఫలితాలను పసిగట్టిన, అప్పటి ఆత్మ సాక్షి, ఇప్పటి శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్, నిర్వహించిన,  ‘మూడ్ ఆఫ్ ది ఏపీ’ తాజా సర్వే ప్రకారం 19.05.2022 నాటికీ రాష్టంలో ఉన్న రాజకీయ ముఖచిత్రం ఇది. శ్రీ ఆత్మ సాక్షి ( ఎస్ఎఎస్)  ఏదో సర్వే చేశాం అంటే చేశాం అన్నట్లు కాకుండా, ఇంచు మించుగా ఐదు నెలలలో ఐదు విడతల్లో క్షేత్ర స్థాయిలో, అన్ని వర్గాల ప్రజలను, మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి, 43 అంశాలకు సమబందించి  సేకరించిన ప్రజాభిప్రాయం అధాంగా శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితం. ఓటర్లను విభిన్న ప్రాతిపదికల ఆధారంగా  20 వర్గాలుగా విభజించి ప్రతి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యతా క్రమలో సేకరించి సర్వే నిర్వహించామని నిర్వాహకులు సర్వే ఫలితాల విడుదల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.   మరో వంక ముందస్తు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో, నిర్వహించిన మూడ్ ఆఫ్ ఏపీ’ సర్వే వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, ఇప్పటికే అధికార పార్టీ బలాన్ని సగానికి సగం దించేసే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు ఇంత బలంగా వీస్తున్నాయంటే, ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారి, అధికార పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే, తెలుగు దేశం, జనసేన పొత్తు ఇంచుమించుగా ఖాయమైన నేపధ్యంలో, రెండు పార్టీల ఓటుతో పాటుగా తటస్థ ఓటు కలిస్తే, వైసీపీకి బొమ్మ కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అదలా ఉంటే గత ఎన్నికలలో పోలిస్తే, వైసీపీ ఏకంగా నాలుగు శాతానికి పైగా (4.7 శాతం) ఓట్లను కోల్పోతోంది. 2019 ఎన్నికలలో ఇంచుమించుగా 50 ( 49.95) శాతం ఓట్లు పొందిన వైసీపీ ఓటు షేర్ ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే, 45.25 శాతానికి పడిపోతుంది. టీడీపీ ఓటు  షేర్, గత ఎన్నికలలో పోలిస్తే మూడు శాతానికి పైగా(3.48 శాతం) పుంజుకుని, 39.26 శాతం నుంచి 42.75 శాతానికి చేరుతుందని సర్వే సూచిస్తోంది. అదే విధంగా, జనసేన ఓటు షేర్ కూడా ఇంచుమించుగా రెండు శాతానికి పైగా (2.05 శాతం) వరకు పెరుగుతోంది.గత ఎన్నికలో 6.7 శాతం ఓట్లు మాత్రమే పోలైన జనసేనకు, ఈసారి 8.75 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే స్పష్టం చేసింది. అంటే,సర్వే లెక్కల ప్రకారం చూస్తే, వైసీపే కోల్పోయే ప్రతి ఓటు, నేరుగా టీడీపీ లేదా జనసేన ఖాతాలో చేరుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల పై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. మరో వంక 1.75 శాతంగా ఉన్నఎటు పోతుందో తెలియని నిశ్శబ్ద ఓట ( సైలెంట్ ఓటు ఫోర్సు, ఎస్ఓపీ), బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ఖాతాలో చేరే ఆయా పార్టీల సంప్రదాయ ఓటు (1.5శాతం)  కీలకంగా మారుస్తుంది శ్రీ ఆత్మ సాక్షి సర్వే సూచిస్తోంది .సహజంగా, సైలెంట్ ఓటు, గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతుంది.  సో .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి  పోటీ చేస్తే, వైసీపీ అధికారం కోల్పోవడమే కాదు, అసలు అడ్రస్ గల్లంతు అయినా ఆశ్చర్య పోనవసరం లేదని  విశ్లేషకులు పేర్కొంటున్నారు. శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ జిల్లాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించింది. 30 శాతం కంటే తక్కువ మార్కులతో సామర్ధ్య పరీక్షలో ఫెయిల్ అయిన ఎమ్మెల్యల్లో, కొత్త, పాత మంత్రులు కూడా ఓ 20 మది వరకు ఉన్నారని సర్వే చెపుతోంది.

Related Posts