YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫుల్ క్లారిటీతో జనసేనాని

ఫుల్ క్లారిటీతో జనసేనాని

విశాఖపట్టణం, మే 24,
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తుల ఆవశ్యకతపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలన్న సంకేతాలూ పార్టీ అధినేత నంచి వచ్చేశాయని వారు చెబుతున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులపై జనసేనాని అసహనంతో ఉన్నరని కూడా వారు చెబుతున్నారు. బీజేపీ ఏపీ నాయకులు జగన్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.అందుకే వారి వ్యాఖ్యలు, ప్రకటనలకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వొదని కూడా పార్టీ కేడర్ కు ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారని చెబుతున్నారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక వైపు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తూనే మరో వైపు పొత్తుల విషయంలో అయోమయాన్ని సృష్టిం చే ప్రకటనలు చేయడం ద్వారా జగన్ కు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తల విషయంపై నిర్ణయం తీసుకోవలసింది బీజేపీ జాతీయ నాయకత్వం కానీ, ఇక్కడి నాయకులు కాదని ఆయన చెబుతున్నారు.బీజేపీ రాష్ట్ర నేతలు ఒక వైపు పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీకి పొత్తు ఉందని చెబుతూనే.. మరో వైపు తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రశక్తే లేదంటూ చేస్తున్న ప్రకటనలు ఓట్ల చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని, అందుకే పవన్ కల్యాణ్ ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానంతోనే తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జనసేనాని భావిస్తున్నారు.   ఓట్లు చీలనివ్వబోమన్న ప్రకటనతోనే తన ఉద్దేశమేమిటన్నది పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పేశారనీ, దానిపై జనసేనలో  ఎలాంటి భిన్నాభిప్రాయం లేకపోవడమే కాకుండా.. తెలుగుదేశంతో పొత్తు అనగానే జనసైనికులలో ఉత్సాహం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారిక ప్రకటన లేకుండానే జనసైనికులు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు రాష్ట్రంలో కనీస ఉనికి లేని బీజేపీ, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రకటనలతో జగన్ కు మేలు చేసేలా వ్యవహరించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ అన్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వల్ల రాష్ట్రంలో జనసేనకు కానీ, తెలుగుదేశంకు కానీ వీసమెత్తు ప్రయోజనం లేదనీ, పైగా ఆ పార్టీని కలుపుకు పోవడం వల్ల మైనారిటీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉందనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు

Related Posts