అమరావతి
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో మంగళవారం జరిగిన చర్చలు ముగిసాయి. పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలి. సీపీఎస్ ఉద్యోగులకు నచ్చజెప్పాలని ఉద్యోగ నేతలకు సూచింది. జీపీఎస్పై తమ అభిప్రాయాలని ఆరు సంఘాల నేతలు చెప్పారు. జీపీఎస్లో సీపీఎస్లోని అవలక్షణాలన్నీ ఉన్నాయి. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయి రాజస్థాన్లో 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్లోకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు పేర్కోన్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఎప్పటికైనా ఆ మొత్తం ఉద్యోగులదేనని ఉద్యోగ సంఘాలు అన్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఉద్యోగ సంఘాలు వివరించాయి. జీపీఎస్లో ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాలని మంత్రుల కమిటీ అడిగింది.