టోక్యో మే 24
క్వాడ్ దేశాలు ఇవాళ క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రకటించాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. క్వాడ్ ఫెలోషిప్ పొందే విద్యార్థులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ నాలుగు దేశాలకు చెందిన వంద మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా విద్యార్థులకు స్పాన్సర్‌షిప్ ఇస్తారు. గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లను విద్యార్థులు పూర్తి చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. క్వాడ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని భారతీయ విద్యార్థులను ప్రధాని మోదీ కోరారు.