చండిఘడ్ మే 24
పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధక శాఖ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించడంతో… ఏసీబీ వెంటనే విజయ్ సింఘాల్‌ను అరెస్ట్ చేసింది. విషయంపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. మంత్రి విజయ్ సింఘాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాను. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశా. తన శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారు కూడా. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు అని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. . ఇక.. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ పేర్కొంది.