YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

6 మిలియన్లు దాటిన ఎస్ బి ఐ కస్టమర్ బేస్ 6 నెలల్లో 1 మిలియన్ కస్టమర్లను పొందిన కంపెనీ 16 శాతానికి పైగా పెరిగిన మార్కెట్ వాటా

6 మిలియన్లు దాటిన ఎస్ బి ఐ కస్టమర్ బేస్      6 నెలల్లో 1 మిలియన్ కస్టమర్లను పొందిన కంపెనీ	          16 శాతానికి పైగా పెరిగిన మార్కెట్ వాటా

దేశ అగ్రగామి క్రెడిట్ కార్డ్ జారీ సంస్థల్లో ఒకటైన ఎస్ బిఐ కార్డు, తన కార్డు పరిమా ణంలో ఎన్నడూ లేనంత వృద్ధిని సాధించడం ద్వారా, తన కార్డుహోల్డర్ బేస్ ను ఆరు మిలియన్లకు పైగా పెంచుకుంది. 2017సెప్టెంబర్ మరియు 2018 ఫిబ్రవరి మధ్య కాలపు 6 నెలల్లో 1 మిలియన్ కస్టమర్లను కం పెనీ జోడించింది. తద్వారా దేశంలో రెండో అతిపెద్ద  క్రెడిట్ కార్డ్ జారీ సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసు కుంది మరియు మార్కెట్ వాటాను 16 శాతానికి పెంచుకుంది. 2016 అక్టోబర్ నుంచి 2017 సెప్టెంబర్ మ ధ్యలో 1 మిలియన్ కార్డులను జోడించడం ద్వారా కంపెనీ 2017 లో 5 మిలియన్ కస్టమర్ బేస్ ను సాధిం చింది. ఆ  వృద్ధి రేటు రెట్టింపైంది. సగటు నెలవారీ కార్డు వ్యయం రూ.7000 కోట్లకు పైగా పెరిగింది. ఏడాది క్రితం ఇది రూ.4,000 కోట్లుగా ఉండింది.దీని గురించి ఎస్ బిఐ కార్డు ఎండీ, సీఈఓ 

హర్ దయాళ్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘మేము సాధించిన ఈ గణనీయ వృద్ధి మా ఖాతాదారుల నిరంతర విశ్వాసం మరియు మద్దతు కారణంగానే సాధ్యపడింది. వినూ త్న, పరిశ్రమ అగ్రగామి ఉత్పత్తులను చక్కటి సేవ మరియు పటిష్ఠమైన విశ్వసనీయ, పారదర్శకతల మద్ద తుతో అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కస్టమర్లు ప్రాధాన్య పూరిత బ్రాండ్ గా మమ్మల్ని మార్చారు. పరిశ్రమ వృద్ధి రేటు 25 శాతంగా ఉంటే, గత కొన్నేళ్ళుగా మేము 40% సీఏజీఆర్ కు పైగా నిలకడతో కూడిన వృద్ధిని సాధించాం. కార్డుల సంఖ్య మరియు చేసే వ్యయం రెండింటిలోనూ మా మార్కెట్ వాటా నిలకడగా పెరుగుతూనే ఉంది’’ అని అన్నారు.భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘భారతదేశం ఎంతో వేగంగా డిజిటల్ గా మా రుతున్న నేపథ్యంలో మరింత వృద్ధి మరియు వినూత్నతకు ఎంతో అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నాం. అ త్యుత్తమ పేమెంట్ సొల్యూషన్స్ వృద్ధి చేసేందుకు మరియు కస్టమర్ అనుభూతిని మెరుగుపరిచేందుకు వినూ త్నతను మరియు సాంకేతికతలతో ఇన్వెస్ట్ చేయడాన్ని మేము కొనసాగిస్తాం. డిజిటల్ పరివర్తన యొక్క తదుపరి స్థాయికి చేరుకోవడంలో మరియు వినియోగదారు అనుభూతిని మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సుకు గల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం మాకెంతో ఉద్వేగాన్ని అందిస్తోంది. నవతరం మాకు అతిపెద్ద అవకాశాన్ని అం దిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. వీరి కోసం మేము ఇప్పటికే విశిష్ట ఉత్పత్తులను కలిగి ఉన్నాం మరియు నూ తన తరం అవసరాలు తీర్చేందుకు నూతన భాగస్వామ్యాలు, ఉత్పత్తులు మరియు ఆఫర్లను అందించడాన్ని కొ నసాగిస్తాం. మా కస్టమర్లకు విలువను సృష్టించడాన్ని కొనసాగించడం ద్వారా, భారతదేశంలో పేమెంట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తోడ్పడంతో పాటుగా అగ్రగామి కార్డ్ జారీ సంస్థగా మా స్థానాన్ని పటిష్ఠం చేసుకోవాలని మేము భావిస్తు న్నాం’’ అని అన్నారు.2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2018 ఆర్థిక సంవత్సరం వరకు, కంపెనీ ఏటేటా ప్రాతిపదికన 75 శాతం పైగా వృద్ధి సా ధించింది. సగటు కార్డు వ్యయం అనేది పరిశ్రమ వృద్ధి రేటుకు సుమారుగా రెట్టింపుగా ఉంది. కస్టమర్ బేస్ పై మా ర్కెట్ వాటా 15 % నుంచి 16 శాతానికి పెరగింది. 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2018 ఆర్థిక సంవత్సరం వరకు,  కార్డ్ ద్వారా చేసే వ్యయాలు 13 % నుంచి 16 % దాకా పెరిగాయి.వివిధ అంశాలు ఎస్ బిఐ యొక్క నిలకడైన వృద్ధికి దారి తీశాయి. కంపెనీ పటిష్ఠ ప్రీమియం పోర్ట్ ఫోలియోను ని ర్మించుకుంది. గణనీయంగా వ్యయం చేసేందుకు ఇది తోడ్పడింది. ఎస్ బీఐ కార్డ్ ఎలైట్ అనేది టాప్ ఎండ్ ప్రీమి యం ఉత్పాదన. ఎస్ బీఐ కార్డ్ ప్రైమ్ నగర, యువ కస్టమర్లకు అనువైంది.  ఎస్ బీఐ కార్డ్  వినూత్నతలో ముం దంజలో ఉంది. యువ ఆన్ లైన్ తరం కోసం సింప్లీ క్లిక్ ఎస్ బీఐ కార్డ్, డాక్టర్స్ ఎస్ బీఐ కార్డ్ వంటి విశిష్ట ఉత్పా దనల ద్వారా నిర్దిష్ట వినియోగ విభాగానికి చెందిన వారి మారుతున్న అవసరాలను తీర్చడంలో అగ్రస్థానంలో ఉం టోంది. కంపెనీ యొక్క కో-బ్రాండెడ్ పోర్ట్ ఫోలియో పరిశ్రమలోనే విస్తృతమైందిగా, వైవిధ్యభరితమైందిగా ఉంది. గణ నీయ చోదక శక్తిగా ఉంది. ఎస్ బీఐ కార్డ్ ఇటీవల – దేశం యొక్క అత్యంత రివార్డింగ్ ఫ్యూయల్ కో-బ్రాండ్ కార్డు బీ పీసీఎల్ ఎస్ బీఐ కార్డ్ తో గల తన పటిష్ఠ భాగస్వామ్య పోర్ట్ ఫోలియోను విస్తరించింది. వివిధ విభాగాల్లో మరి యు ప్రాంతాల్లో ఒప్పందాల ద్వారా కంపెనీ తన క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ ను మరింత విస్తరించనుంది.కస్టమర్ అనుభూతిని మెరుగుపరిచేందుకు  ఉపయోగించే సాంకేతిక అధునాతనలు మరియు సెక్యూరిటీ కూడా వృద్ధికి తోడ్పడ్డాయి. కంపెనీ ఏఐ మరియు హోస్ట్  కార్డ్ ఎమ్యులేషన్ వంటి  నూతన తరం సాంకేతికతలను ఇం టిగ్రేట్ చేయడం వినియోగదారులకు తిరుగులేని పేమెంట్ అనుభూతిని అందిస్తుంది.   

Related Posts