YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక నుంచి వాట్సాప్‌లో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సులు

ఇక నుంచి వాట్సాప్‌లో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సులు

న్యూఢిల్లీ, మే 24
డిజీలాకర్‌లో దాచుకొన్న డిజిటల్‌ పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ లాంటి డాక్యుమెంట్లను ఇక నుంచి వాట్సాప్‌లో కూడా పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో మైగవ్‌ హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 9013151515కు ‘డిజీలాకర్‌/నమస్తే/హాయ్‌’ అని మెసేజ్‌ చేస్తే సరిపోతుంది.మీ డిజీ లాకర్‌ అకౌంట్‌లో ఉన్న డిజిటల్‌ డాక్యుమెంట్లు వాట్సాప్‌లో కనిపిస్తాయి. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. డిజీలాకర్‌ ఖాతా లేనివాళ్లు వాట్సాప్‌లోనే ఖాతాను తెరవడానికి అవకాశం కల్పించింది. ‘ఇప్పుడు వాట్సాప్‌ నుంచి పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, మార్కుల మెమోలు, ఇన్సూరెన్స్‌ పాలసీల డిజిటల్‌ డాక్యుమెంట్లు పొందవచ్చు’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రభుత్వ సేవలు సులభంగా, పారదర్శకంగా పొందేందుకు దీన్ని రూపొందించినట్టు తెలిపింది. డిజీలాకర్‌లో ఇప్పటికే 10 కోట్ల మంది రిజిస్టర్‌ అయ్యారు.

Related Posts