కడప
మునిసిపల్ కార్మికుల అందోళన తొమ్మిదవ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం కడప మునిసిపల్ పాత ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఇందులోని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ మాట్లాడుతూ చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలి. చనిపోయిన కార్మికుల సంబంధించి ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ఇవ్వాలి. ఇంజినీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జారి చేసిన జి ఓ నెం7ప్రకారం టెక్నీకల్ వేతనాలు పెంచాలి. స్కిల్ద్, సెమి స్కిల్ద్ ప్రకారం వేతనాలు పెంచాలి. ప్రభుత్వ ప్రకటించిన జీవో ప్రకారం ఇంజినీరింగ్ సెక్షన్ వారికి Rs.32622/వేతనాలు ఇవ్వాలి. హెల్త్ అలవెన్స్ ని ఇంజినీరింగ్ కార్మికుల వర్తింపజేయాలి. పెండింగ్ లో ఉన్న పనిముట్లు, మరియు చెప్పులు, సబ్బులు, నూనె యూనిఫాం ఇవ్వాలి. సమస్యలను పరష్కకరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఇందుకు పూర్తి బాధ్యత అధికారుల దే అని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఈనెల 25న ఛలో విజయవాడ డిఎం ఆఫీసు ముట్టడి కార్యక్రమనికి కార్మికులందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచుపాటి తిరుపాల్, కడప నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుపాటి శ్రీరామ్, డ్రైవర్ కమిటీ అధ్యక్షులు వడ్లపల్లి శ్రీధర్ బాబు,ఇత్తడి ప్రకాష్, రమణ, శ్రీను,అసిబాబు,శివ, రాముడు, నూతన డ్రైవర్లు లోడర్లు,తదితరులు పాల్గొన్నారు.