కడప
రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీ పరంగా ఆయన పై చర్యలు లేవు. వివేకానంద రెడ్డి హత్య పై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిబ్బందిని ముసుగు మనిషి బెదిరించడం జరిగింది. రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్ గా, మధ్యాంద్ర ప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి అంధ్రప్రదేశ్ గా మారిపోయింది.వైకాపా పాలనలో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. ఇప్పటికైనా శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిందితుడు ఉదయ భాస్కర్ ను పార్టీ నుండి బహీష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అయన అన్నారు