న్యూ డిల్లీ మే 24
సైబీరియా అడవుల్లోని యాకూత్ గ్రామంలో ఉన్న బటాగైక బిలం రోజురోజుకు విస్తరిస్తున్నది. దాని చుట్టుపక్కల ఉన్నభూమిని, చెట్లను, జీవజాలాన్ని తనలోకి లాగేసుకొంటున్నది. దీన్ని ‘పాతాళానికి మార్గం’, ‘నరక ద్వారం’ అని స్థానికులు అభివర్ణిస్తున్నారు. 1980ల్లో బటాగైక బిలాన్ని తొలిసారిగా గుర్తించారు. అప్పుడు ఇది ఒక కిలోమీటర్ వెడల్పుతోటి 86 మీటర్ల లోతు ఉంది. ప్రతీ ఏడాది 30 మీటర్ల చొప్పున విస్తరిస్తున్నది. 25 లక్షల ఏండ్ల క్రితం భూ అంతర్భాగంలో గడ్డకట్టిన మంచు కరిగిపోతుండటం వల్లనే ఇలా జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 1960ల్లో యాకూత్‌లో అడవులను కొట్టేశారు. ఫలితంగా ఇక్కడ సూర్యరశ్మి పెరిగింది. ఇది భూ అంతర్భాగంలోని మట్టి పొరలపై ప్రభావం చూపింది.