YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో జనసేన వర్సెస్ టీడీపీ

తిరుపతిలో జనసేన వర్సెస్ టీడీపీ

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. ఆ పార్టీకి ఎంతో సెంటిమెంటుతో కూడుకున్న నియోజకవర్గం తిరుపతి. టీడీపీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ సైతం తిరుపతి నుంచి పోటిచేసి గెలిచారు. అంతగా పార్టీకి బలమైన క్యాడర్ వుంది తిరుపతిలో. గత ఎన్నికల్లో సైతం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో నలభైవేల మెజారిటీతో ఓటమీ పాలైతే, ఇక్కడ మాత్రం కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడింది. 2014లోనూ, టిడిపి మంచి మెజారిటితోనే గెలిచింది. అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు జనసేన పార్టీ హైజాక్ చేస్తోందని టాక్ జోరుగా తిరుపతిలో సాగుతోంది.టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పనితీరుతో పాటు పార్టీలోని గ్రూపుల గోలతో అసలు నియోజక వర్గంలో పార్టీ ఉందా లేదా అన్న అనుమానం, సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. మరోవైపు జనసేన మాత్రం తిరుపతి టార్గెట్ గా వరుసగా నిరసనలు, ధర్నాల చేస్తోంది. టిడిపి చేస్తున్న కార్యక్రమాలు ఏంటో కూడా తెలియడం లేదన్నది లోకల్ గా హాట్ టాపిక్. కొన్ని రోజులుగా వైసిపిని తీవ్ర స్ధాయిలో జనసేన టార్గెట్ చేస్తోంది. విద్యుత్,బస్ చార్జీల పెంపు నుంచి టిటిడిలోని లోపాలు ఎత్తి చూపుతోంది. రసిక రాజా ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా తీస్తామని, రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విషసర్పాలు అంటూ పోస్టర్ ను ఆవిష్కరించారు.తిరుపతి టీడీపీ కోల్డ్ వార్ పై అధిష్టానానికి ఫిర్యాదులు ,సెగ్మెంట్ ఇంచార్జీతో పొసగక ఎవరిదారి వారిదే  ఇన్ చార్జ్ ను మార్చాలని అధిష్ఠానాన్ని కోరారా?శ్రీనివాస్ పేరు ఇప్పుడు పార్టీలో జోరుగా,శ్రీనివాస్ ను ఇంచార్జీగా నియమించాలని కోరుతున్నారా?జగన్ రెడ్డి పేరు జైలు రెడ్డి.. కేరాఫ్ చంచల్ గూడా అని, సీఎం ను ఇక నుంచి జైలు రెడ్డి అని పిలుస్తామని తీవ్రస్దాయిలో విరుచుపడుతోంది జనసేన. ఇంతలా జనసేన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టిడిపి నేతలు మాత్రం మాకెందుకులే అనే డైలాగ్ ను కేడర్ వద్ద వినిపిస్తున్నారట. మరికొందరు ఇక లాభం లేదని, చంద్రబాబు, లోకేష్ లకు ఫిర్యాదు చేశారట తెలుగు తమ్ముళ్ళు. ఏ పదవీ లేని జనసేన నేతలు, ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే, టిడిపిలో ఉన్ననాయకులు ఇన్ఛార్జితో పొసగలేక, ఎవరిదారిన వాళ్ళు వుండటం పార్టీకి మైనస్ గా మారింది. జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పదవులు దక్కించుకున్న నేతలు తిరుపతిలో ఏంచేస్తున్నారో అర్థంకావడం లేదని, కార్యకర్తలు రగిలిపోతున్నారట.ఇక గత కార్పొరేషన్ ఎన్నిక‌ల రేస్‌లో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉండి కూడా, టీడీపీ చేతులెత్తేసింది. క‌నీసం స‌గం డివిజ‌న్ల‌లో కూడా పోటీ చేయ‌లేని ద‌య‌నీయ స్థితిలోకి పార్టీ కూరుకుపోవడంపై టిడిపి తీవ్రస్దాయిలో చర్చలు సాగాయి. అయినా మాజీ ఎమ్మెల్యేలో గాని, లోకల్ నేతల్లో మార్పురాలేదట. ఏదొ చేశామంటే చేశామనేలా వ్యవహరించడం పార్టీ కేడర్‌కు రుచించడం లేదట. అలా రుచించని కొద్దిమంది నేతలు ఇన్ చార్జ్ ను మార్చాలని అధిష్ఠానాన్ని కోరినట్లు టాక్ నడుస్తోంది. బలిజసామాజిక వర్గానికి చెందిన జేబి శ్రీనివాస్ పేరు ఇప్పుడు పార్టీలో జోరుగా వినపడుతోందట. టిడిపి సైలెంట్ అవ్వడంతో తిరుపతిని హైజాక్ చెయ్యాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందట జనసేన. ఒకవేళ పొత్తు కుదిరితే తిరుపతి సీటు అడగాలనే ఆలోచన జనసేన వుందట. స్వయంగా పవన్ బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరుగుతోంది.

Related Posts