YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బోటు ప్రమాదంపై చంద్రబాబు సమీక్ష గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు

బోటు ప్రమాదంపై చంద్రబాబు సమీక్ష గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు

మంటూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు సాయంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రకృతి బీభత్సం వారికి అన్యాయం చేసింది. ప్రభుత్వ పరంగా వారిని అన్నివిధాలా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపాధి,సంక్షేమ పథకాల వర్తింపచేయాలి. ఆర్టీజి ద్వారా బాధిత కుటుంబాలపై రియల్ టైమ్ అధ్యయనం చేయాలని సూచించారు. మృతుల్లో ముగ్గురి భార్యలు వితంతు పెన్షన్లకు అర్హులు. ఒకరి కుమార్తె పదో తరగతి పాస్ అయ్యింది. మరొకరి కొడుకు డిప్లమో పాస్ అయ్యాడు. ఇంకొకరి కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది. మరొకరికి చదువుకోని కొడుకు ఉన్నాడు. మృతుల కుటుంబాల ఉపాధి బాధ్యత జిల్లా కలెక్టర్ దేనని అయన అన్నారు. చంద్రన్న బీమా కిందకు వచ్చేవారు 11మంది, చంద్రన్న బీమా కిందకు రానివారు 8మంది వున్నారు. అయినా, మృతుల్లో ప్రతి కుటుంబానికి రూ.10లక్షల లబ్ది అందాలని అయన అన్నారు. 19 కుటుంబాలకు పక్కాఇళ్లు నిర్మించాలని ఆదేశించారు.  తరువాత అయన ‘మంటూరు-కొండమొదలు’ రోడ్ల పరిస్థితిపై ఆరా తీసారు. 30 కి.మీ రోడ్లు లేక గిరిజనుల అవస్థలను  అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దేవీపట్నం-కొండమొదలు దాకా రోడ్లు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి  సూచించారు. ఏటిగట్టు వెంబడి రహదారి నిర్మాణంపై దృష్టి పెట్టాలి. గిరిజన గ్రామాలనుండి రంపచోడవరం వరకు రోడ్ల అభివృద్ధి చేయాలని అన్నారు. కొక్కాలగూడెం-గెద్దాడ 18కి.మీ రోడ్డు నిర్మాణంపై దృష్టిపెట్టాలి. తూర్పు,గోదావరి జిల్లా గిరిజన తండాలకు రోడ్లను అభివృద్ది చేయాలి.  రూ.కోటి తో గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని అయన అన్నారు. 

Related Posts