YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేకపాటి ఇంట్లో పొలిటికల్ చిచ్చు

మేకపాటి ఇంట్లో పొలిటికల్ చిచ్చు

నెల్లూరు, మే 26,
మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. మొదట్లో గౌతంరెడ్డి వారసురాలిగా ఆయన సతీమణి శ్రీకీర్తి రాజకీయాల్లోకి వస్తారని భావించారు. శ్రీకీర్తి అభ్యర్థి అయితే టీడీపీ కూడా తమ అభ్యర్థిని పెట్టబోమని సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గౌతంరెడ్డి కుటుంబం.. శ్రీకీర్తి కాకుండా ఆయన సోదరుడు విక్రంరెడ్డిని అభ్యర్థిగా ఉంటారని ప్రకటించింది. ఇదే సమయంలో రాజమోహన్ రెడ్డి సోదరి కుమారుడు బిజీవేముల రవీంద్రరెడ్డి తాను బరిలో ఉంటానని, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు.. ఉదయగిరి, ఆత్మకూరులలో అభివృద్ధికి తన మేనమామ రాజమోహన్ రెడ్డి ఏమీ చేయలేదని విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నట్టు రవీంద్రరెడ్డి చెప్పారు. మేకపాటి సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని.. రాజకీయాల ద్వారా వ్యాపారాలను పెంచుకున్నారని ఆరోపించిన రవీంద్రరెడ్డి.. వాటిని ఎన్నికల ప్రచారంలో చెబుతానంటున్నారు.ఆత్మకూరు బరిలో బీజేపీ ఉంటుందని.. అభ్యర్థిగా రవీంద్రరెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ సోము వీర్రాజు కూడా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో ఉపఎన్నిక ఆసక్తిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా పోటీ మేకపాటి కుటుంబ సభ్యుల మధ్యే జరిగే అవకాశాలు ఉండటంతో.. విమర్శలు ప్రతివిమర్శల జోరుగా ఉంటాయని అనుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రంరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. తన తండ్రితో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశం భారీగానే నిర్వహించడం చర్చగా మారుతోంది. వీటిని పరోక్షంగా తమ బల ప్రదర్శనకు వేదిగా మార్చుకుంటున్నారు మేకపాటి కుటుంబ సభ్యులు.
కంటే ఉపఎన్నికలో ఎక్కువ మెజారిటీ సాధించలన్నది మేకపాటి కుటుంబ సభ్యుల వ్యూహం. ప్రత్యర్థిగా తమ కుటుంబానికే చెందిన రవీంద్రరెడ్డి సవాల్‌ చేస్తుండటంతో రాజమోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. పనిలో పనిగా రవీంద్రరెడ్డి సైతం మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలతో ఆయన పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారం షెడ్యూల్‌ ప్రకటిస్తానని రవీంద్రరెడ్డి చెబుతున్నారట.
ఒకప్పుడు మేకపాటి ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబం. అంతా కలిసే వ్యాపారాలు చేసేవారు. వ్యాపార లావాదేవీల వల్ల రవీంద్రారెడ్డి ఫ్యామిలీకి మేకపాటి విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. 2014లో రవీంద్రారెడ్డి ఎంపీ ఎన్నికల్లో మేకపాటికి వ్యతిరేకంగా పనిచేశారు. చెన్నై కేంద్రంగా వ్యాపారాలు చేసే రవీంద్రారెడ్డి రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. పాత కక్షలన్నింటినీ ఈ ఉపఎన్నికలో తీర్చుకోవాలని చూస్తున్నారట. బీజేపీకి కూడా అక్కడ అభ్యర్థి లేడన్న సమస్య తీరనుంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అనే బీజేపీ పోటీకి రెడీ అవుతోంది.ఆత్మకూరు ఉపఎన్నికపై టీడీపీ ఇంకా ఫోకస్‌ పెట్టలేదు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక పోటీ చేయాలా వద్దో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంమీద మేకపాటి కుటుంబం మధ్య బైఎలక్షన్‌ పోరు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Posts