YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అర్బన్ హౌసింగ్ గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయండిఃసిఎస్.

అర్బన్ హౌసింగ్ గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయండిఃసిఎస్.

రాష్ట్రంలో జవహర్ లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్లో భాగంగా బిఎస్యుపి,ఐహెచ్ఎస్డిపి ప్రాజెక్టుల కింద మంజూరైన అర్బన్ హౌసింగ్ గృహాలన్నిటినీ త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయంలోని సిఎస్ కార్యాలయంలో పారిశ్రామిక కార్మికులకు గృహవసతి,జవహర్ లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద బిఎస్యుపి,ఐహెచ్ఎస్డిపి ప్రాజెక్టుల కింద మంజూరైన గృహాలపై ఆయన కార్మిక,పట్టణాభివృద్ధి,గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్షించారు. తొలుత పారిశ్రామిక కార్మికులకు గృహ వసతికి సంబంధించిన అంశంపై కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ వివరిస్తూ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు కింద ప్రస్తుతం 14లక్షల 50వేల మంది వరకూ కార్మికులు రిజిష్టర్ అయి ఉన్నారని వారు చెల్లించిన కార్మిక సెస్ నిధుల నుండి కొంత మొత్తాన్ని సబ్సిడీగా చెల్లించి వారికి ఇళ్లు నిర్మాణ పధకం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పందించి మాట్లాడుతూ ఆకార్మికుల ఆధార్ నంబరుతో సహా ఆవివరాలను మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు అందిస్తే వారు పరిశీలించి ఎంతమందికి ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ అవసరం ఉంటుందనేది పరిశీలించి చర్యలు తీసుకుంటారని అన్నారు.అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద నమోదై 50 రోజులకు పైగా పనిచేసిన కార్మికులు కార్మిక బోర్డు కింద రిజిష్టర్ కాకుండా ఉన్న వారిని కూడా రిజిష్టర్ చేసి వారికి కూడా ఈవిధంగా గృహ నిర్మాణానికి తోడ్పాటును అందించాల్సి ఉందని అన్నారు.ఇందుకు గాను వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించాలని అలాంటి వారిని గుర్తించి వెంటనే రిజిష్టర్ చేయాలని కార్మికశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు. జవహర్ లాల్ నెహూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్ లో భాగంగా బిఎస్యుపి, ఐహెచ్ఎస్డిపి పధకాల కింద మంజూరైన గృహాలపై మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికల వలవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వివిధ పట్టణాలలో మంజూరైన ఇళ్లు వాటి ప్రగతిని వివరించారు.దానిపై సిఎస్ స్పందించి ఈప్రాజెక్టుల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలన్నిటినీ త్వరతిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అర్బన్ హౌసింగ్ కింద మంజూరైన ఇళ్లన్నిటినీ సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో 10 నగరాలు,పట్టణాల్లో చేపట్టిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఒక యువ అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.ఈప్రాజెక్టు కింద వివిధ పట్టణాల్లో చేపట్టిన ఇళ్లు త్వరగా పూర్తిచేసి వాటిని విక్రయించడం ద్వారా త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇందుకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సిఎస్ ఆదేశించారు.ఈసమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వి ప్రసాద్,మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్,రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే,కార్మికశాఖ కమీషనర్ వరప్రసాద్,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts