YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ 2 నుంచి రైతు బీమా

జూన్ 2 నుంచి రైతు బీమా

వ్యవసాయ రంగం లో తెలంగాణా రాష్ట్రం చరిత్ర సృష్టించింది.  రైతు కు పెట్టుబడి సాయం 10 వ తేది నుండి  పండుగ వాతావరణంలో జరిగింది.  రైతు బీమా పధకాన్ని  జూన్ 2 నుండి ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 

హన్మకొండ హరిత కాకతీయ లో మీడియా సమావేశం లో కడియం మాట్లాడుతూ  రైతు బంధు  పధకం పై  రైతులు  ఆనందాన్ని  వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అధికారులకు గ్రామాల్లో గ్రామస్తులు సాదర స్వాగతం పలుకుతున్నరన్నారు. 10 నుండి 18 వరకు  జరిగిన చెక్కుల పంపిణి లో  ఎక్కడ  అవాంతరం లేకుండా  సజావుగా సాగిందని కడియం తెలిపారు.  జూన్ 2 వ తీడి నుంచి రైతు భీమా పధకం అమలు కానుందని, .  రైతు ఏ కారణం వల్ల  అయినా చనిపోతే  ఆయన కుటుంబం రోడ్డుమీద పడకుండా ఉండొద్దని ఆలోచించిన కేసిఆర్ 5 లక్షల  రూపాయాలతో రైతు బీమా పథకాన్ని అమలు చేయనున్నామన్నారు.   తెలంగాణ రాష్ట్రం దేశంలో  అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా  నిలుస్తోందని అన్నారు.  విపక్షాలు రైతు బంధు పధకం పై విమర్శలు చేశాయి తప్పవారి వాదనలో  నిజం లేదని అన్నారు.  బిజెపి  అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో  రుణమాఫీ, ఆర్ధిక  సాయం ఎందుకు చేయ లేక పోతున్నరన్నారు.   కేసిఆర్ ప్రభుత్వాన్ని  విమర్శించే నైతిక  హక్కు ప్రతి పక్షాలకు  లేదని, గిట్టుబాటు ధర ప్రకటించాల్సిన  కేంద్ర ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపిందని విమర్శించారు. పధకం లో లోపాలుంటే  ఎత్తి చూపలే కాని గుడ్డి గా విమర్శించవద్దని కడియం ప్రతి పక్షాలకు హితవు పలికారు. 

Related Posts