వినుకొండ
వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డు పండరీపురం వద్ద కరెంటు లైన్ మరమ్మతులు చేస్తుండగా బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామానికి చెందిన సంపతి మన్నే పుల్లయ్య (22), అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నాగేశ్వరరావు వద్ద కరెంట్ లైన్ పనుల నిమిత్తం కూలీగా వచ్చి పని చేస్తుండగా విద్యుత్ షాక్ సంబంధించి మృతిచెందగా, విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు బాధిత కుటుంబాన్ని వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. మీ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, మీకు ఎల్లప్పుడు అండగా ఉంటామని బాధిత కుటుంబానికి హామి ఇచ్చారు.