మండపేట
తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించే మహానాడుకు మండపేట నుండి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం మండపేట నుండి బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో భారీ ఎత్తున మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు. తెలుగు తమ్ముళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి జరిగే మహానాడుకు భారీ ఎత్తున తరలివెళుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మండపేట, కపీలేశ్వరపురం, రాయవరం మండలాల ప్రతినిధులు యరగతపు బాబ్జి, ముత్యాల వెంకటరావు, పుత్సల శ్రీనివాస్, కొప్పిశెట్టి మాధవరావు, వైఆర్ కె పరమ హంస, బండి గోవింద్, కాదా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.