కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించినవారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతులను ప్రకటించింది. అయితే, పతకం సాధించిన షట్లర్ పీవీ సింధు పేరు నగదు బహుమతుల జాబితాలో లేదు. సైనా నెహ్వాల్ కు రూ. 50 లక్షలు, మరో షట్లర్ సిక్కీరెడ్డికి రూ. 30 లక్షలు, రుత్వికా శివానీకి రూ. 20 లక్షలు, బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ. 25 లక్షల బహుమతులను ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన సింధు పేరును జాబితాలో చేర్చలేదు. ఆంద్రప్రదేశ్ లో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ పోస్టును తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీ అధికారిణి అయిన సింధుకు నగదు బహుమతిని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. 2016 ఒలింపిక్స్ లో పతకం గెల్చినప్పుడు సింధుకు రూ. 5 కోట్ల నగదుతో పాటు హైదరాబాదులో ఇంటి స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.