నంద్యాల
నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట రమణ శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సీ లోని అన్ని రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశాడు. వైద్యులు డాక్టర్ కిషోర్ రెడ్డి కి సూచనలు చేశాడు. పీహెచ్ సీ లో . కాన్పుల సంఖ్య పెంచాలని మాతృ మరణాలు శిశు మరణా లు జరగకుండా ప్రాథమిక దశలోనే గర్భిణీ మహిళలకు రక్తహీనత లేకుండా పౌష్టిక ఆహారాన్ని అందించడం ఐరన్ అండ్ పోలిక్ యాసిడ్ మరియు క్యాల్షియం టాబ్లెట్ ను అందించడం ప్రతి గర్భిణీ మహిళ ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి మాతృ వందన కార్యక్రమంలో గర్భిణీ మహిళలకు అన్ని పరీక్షలు చేసి వైద్యం అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది నీ అలర్ట్ చేసి వాంతులు-విరేచనాలు కలుగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ కిషోర్ రెడ్డిని ఆదేశించారు. పి హెచ్ సి లోని ఫార్మసీ వి భాగాన్ని ల్యాబ్ ను డెలివరీ రూమ్ ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశాడు.